NSUI Leader Wedding | ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

సీఎం రేవంత్​రెడ్డిని ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి మర్యాదపూర్వకంగా కలిశారు.

shashi kiran Mottala

​అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: NSUI Leader Wedding | సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఆయన నివాసంలో ఎన్‌ఎస్‌యూఐ (NSUI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

NSUI Leader Wedding | తన వివాహానికి రావాలని ఆహ్వానం..

​ఈనెల 30వ తేదీన నిజామాబాద్ నగరంలో జరగనున్న తన వివాహ వేడుకకు హాజరై, ఆశీర్వదించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వరదబట్టు వేణురాజ్​ శుభలేఖను అందజేశారు. ​అనంతరం వేణురాజ్ మాట్లాడుతూ.. ప్రజా సేవలో నిరంతరం బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెళ్లి పత్రికను అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సీఎం తమ వివాహ మహోత్సవానికి హాజరై తమను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: కొండా కుటుంబం ఎటువైపు? కీలక రాజకీయ పరిణామంపై ఆసక్తికర చర్చ!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *