RTC Recruitment | ఆర్టీసీలో తాత్కాలిక పద్ధతిలో కండక్లర్లు, డ్రైవర్ల నియామకం

Srinivas Kolluri

అక్షరటుడే,ఆర్మూర్​: RTC Recruitment | ఆర్మూర్​ ఆర్టీసీ డిపో (Armur RTC Depot)లో తాత్కాలిక పద్ధతిలో కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం డిపో మేనేజర్​ మల్లేష్​ ప్రకటన విడుదల చేశారు..

RTC Recruitment | ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో..

ఆర్టీసీ సమ్మె (RTC Strike) నేపథ్యంలో రోజువారి పద్ధతిన సిబ్బందిని నియమిస్తామని డిపో మేనేజర్ తెలిపారు. డ్రైవర్ పోస్టుకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 18 నెలల అనుభవం ఉండాలన్నారు. అలాగే కండక్టర్ పోస్టు (Conductor Post)కు పదో తరగతి అర్హత కలిగి ఉండాలన్నారు. ఈ రెండు పోస్టులకు రోజువారీగా రూ.వెయ్యి వేతనం చెల్లిస్తామని తెలిపారు. ఆసక్తి గలవారు నేరుగా ఆర్మూర్ డిపోలో సంప్రదించాలని.. ఒరిజినల్ ఎస్సెస్సీ మెమో, ఒరిజినల్ ఆధార్ కార్డు, రెండు ఫొటోలు, పాన్ కార్డు తీసుకుని డిపో మేనేజర్​ను సంప్రదించాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి..: Electric Shock | విద్యుదాఘాతంతో యువకుడు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *