అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kakatiya Nizamabad | కాకతీయ విద్యాసంస్థలోని ఉత్తమ విద్యా విధానమే తాము జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో ఆలిండియా ర్యాంకులు సాధించడానికి దోహదం చేసిందని విద్యార్థులు తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే మెరుగైన విద్యాబోధన, డైరెక్టర్ల ప్రత్యేక పర్యవేక్షణ, అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం తమ విజయానికి కారణం అయ్యాయని వివరించారు. ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ విద్యను పాఠశాల స్థాయి నుంచే బోధించడం వల్ల తాము తొలి ప్రయత్నంలోనే ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని పేర్కొన్నారు. ఆలిండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులు ‘అక్షరటుడే’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు.
Kakatiya Nizamabad | ఆలిండియా ర్యాంకులు
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్.హేమ ఆలిండియా 132 ర్యాంకు సాధించింది. అలాగే జి.రాఖి 1,763 ర్యాంకు, రమాదేవి 2,800 ర్యాంకు, బి.సంధ్య 2,984 ర్యాంకు, ఎస్.ఆర్థిక 4,761 ర్యాంకు, హెచ్.భరత్ 6,430 ర్యాంకు, శరత్ చంద్ర 8,388 ర్యాంకు, అమృత వర్షిణి 9,461 ర్యాంకు, సమీక్ష 9,463 ర్యాంకు, ఎ.అత్రిజ్ 9,955 ర్యాంకు, జె.తన్విత 10,292 వంటి ర్యాంకులతో విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు.
Kakatiya Nizamabad | జేఈఈ అడ్వాన్స్డ్‌కు 50 మంది అర్హత
మొత్తం మీద 90 శాతం పైగా ఫలితాలు సాధించిన 10 మంది విద్యార్థులు ప్రత్యేకంగా నిలిచారు. అంతేకాకుండా 50 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్డ్‌కు అర్హత సాధించడం ఈ సంస్థ బలాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. విద్యార్థుల విజయాల్లో వారి స్వీయ కృషితో పాటు సంస్థ అందించిన ప్రణాళికాబద్ధమైన శిక్షణ కీలక పాత్ర పోషించింది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వివరాలు వారి మాటల్లోనే..
అధ్యాపకుల మార్గదర్శకం
– ఎస్.హేమ, ఆలిండియా 132 ర్యాంక్

కాకతీయ కాలేజీ అధ్యాపకుల గైడెన్స్‌లో ప్రతిరోజూ ప్రణాళిక ప్రకారం చదివాను. తరచూ నిర్వహించే పరీక్షలు, విశ్లేషణల ద్వారా వచ్చిన మార్గదర్శకం నాకు ఈ స్థాయి ర్యాంక్ సాధించేందుకు ఎంతగానో సహాయపడింది. ప్రముఖ ఎన్‌ఐటీలో సీఎస్ఈ చదివి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలనేది నా లక్ష్యం.
ప్రతి అంశంలో పట్టు
– జి.రాఖి, ఆలిండియా 1,762 ర్యాంక్

పాఠశాల స్థాయిలో సరైన అవగాహన లేకపోయినా, కాకతీయలో చేరిన తర్వాత ప్రతి అంశంలో పట్టు సాధించడం ద్వారా ఈ స్థాయి ర్యాంక్ సాధించాను. ఉపాధ్యాయుల మార్గదర్శకం, వారి నిరంతర కృషి నా విజయానికి కారణం. మా డైరెక్టర్, ఐఐటీయన్ రామోజీ రావు సర్ వెన్నంటి నిలిచి, ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తుండేవారు. ఆయన గైడెన్స్ మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. థాంక్యూ సర్.
సిస్టమాటిక్ ప్రిపరేషన్
– రమాదేవి, ఆలిండియా 2,800 ర్యాంక్
పునాది స్థాయి నుంచే ఐఐటీ ఓరియెంటెడ్ కోచింగ్ ఎంతో ఉపయోగపడింది. తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల శ్రమ, సిస్టమాటిక్ ప్రిపరేషన్ వల్లే జాతీయ స్థాయి ర్యాంక్ సాధించగలిగాను. మా డైరెక్టర్ తేజస్విని మేడమ్ నిరంతం మమ్మల్ని పర్యవేక్షించేవారు. నమూనా పరీక్షల ఫలితాలను అనాలిసిస్ చేస్తూ.. అధ్యాపకులతోపాటు మాకు కూడా నిర్దేశం చేసేవారు. నా ర్యాంకు సాధనలో ఆ మేడమ్ కృషి ఎనలేనిది.
లక్ష్యసాధన దిశగా మార్గనిర్దేశం
– సీహెచ్ రామోజీ రావు, డైరెక్టర్, కాకతీయ విద్యా సంస్థలు
విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే లక్ష్యసాధన దిశగా మార్గనిర్దేశం చేయడం అతి ముఖ్యం. మా విద్యార్థులు కేవలం జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ పోటీ పరీక్షల్లో సైతం పోటీపడగల సామర్థ్యాన్ని నిరూపించారు. ప్రాథమిక దశ నుంచే సరైన దిశలో శిక్షణ ఇవ్వడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.
విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రయాణం
– సీహెచ్ తేజస్విని, డైరెక్టర్, కాకతీయ విద్యా సంస్థలు
ఈ విజయగాథ కేవలం ఫలితాల కథ కాదు. ఇది కృషి, క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం, లక్ష్యసాధనపై నమ్మకం కలిగిన విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రయాణం. భవిష్యత్తులో జాతీయ స్థాయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు వీరి విజయం ఒక ఆదర్శంగా నిలుస్తుంది.
ఇది కూడా చదవండి..: RTC Strike Nizamabad | నిజామాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె