School Reopening | ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం..

ఉమ్మడిజిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆయా పాఠశాలల యాజమాన్యాలు పూర్తి ఏర్పాట్లు చేశాయి. విద్యార్థులు ఉత్సాహంగా బడులకు వెళ్లారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: School Reopening | ఉమ్మడిజిల్లాలో (Nizamabad) పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆయా పాఠశాలల యాజమాన్యాలు పూర్తి ఏర్పాట్లు చేశాయి. విద్యార్థులు ఉత్సాహంగా బడులకు వెళ్లారు.

School Reopening | ఉత్సాహంగా వెళ్లిన విద్యార్థులు..

దాదాపు రెండు నెలల సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా స్కూళ్లకు వెళ్లారు. ఇన్నాళ్లు తమ ఇళ్లల్లో ఆడిపాడిన చిన్నారులు.. పాఠశాలల్లో తమ స్నేహితులను కలుసుకునేందుకు ఉత్సాహం చూపారు. ఉదయాన్నే సమయానికి బడులకు చేరుకున్నారు. తమ స్నేహితులతో ముచ్చటించారు. మొదటి రోజు నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో (government school) మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.

gtyu sc2

School Reopening | అమావాస్య ఎఫెక్ట్​..

అయితే పాఠశాలల పునఃప్రారంభానికి అమావాస్య కొద్దిమేర ఎఫెక్ట్​ చూపించింది. చాలావరకు ప్రైవేట్​ పాఠశాలల్లో అమావాస్య కారణంగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. కొత్త అడ్మిషన్లు కూడా జరగలేదు. ప్రభుత్వ పాఠశాల్లోనూ హాజరు అంతంతమాత్రంగానే కనిపించింది. రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయిలో విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతారని విద్యాశాఖ(Department of Education) అధికారి తెలిపారు.

55

ఇది కూడా చదవండి: K Namrata Missing | నా సోదరి కనిపించడం లేదు.. పోలీసులకు మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ ఫిర్యాదు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *