అక్షరటుడే, వెబ్డెస్క్ : K Namrata Missing | తన సోదరి కనిపించడం లేదని మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా.. చిన్న కుమార్తె గద్వాల విజయలక్ష్మి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె గతంలో జీహెచ్ఎంసీ మేయర్గా పని చేశారు. ఇటీవల మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా నియామకం అయ్యారు. అయితే తన సోదరి కె నమ్రత (57) కనిపించడం లేదని ఆమె ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
K Namrata Missing | వారిపై అనుమానం
బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్ నెం. 12లో ఉండే తన సోదరి ఈ నెల 4న ఉదయం 10 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదని విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. సతీష్(35), సత్యనారాయణ(45), కుమారి(45) అనే ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Breakfast Scheme Launch | విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి