తెలంగాణFuture City Telangana | ప్రపంచానికే తలమానికంగా ‘ఫ్యూచర్ సిటీ‘: పొంగులేటి

Future City Telangana | ప్రపంచానికే తలమానికంగా ‘ఫ్యూచర్ సిటీ‘: పొంగులేటి

ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ‘‘ఫ్యూచర్ సిటీ’’ నిర్మాణం జరుగుతోందని మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి.శ్రీధర్ బాబు తెలిపారు. “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు ప్రాంతంలో గురువారం పర్యటించారు.

అక్షరటుడే, హైదరాబాద్​: Future City Telangana | ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ‘‘ఫ్యూచర్ సిటీ’’ నిర్మాణం జరుగుతోందని మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి.శ్రీధర్ బాబు తెలిపారు. “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు ప్రాంతంలో గురువారం పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ భవనం (ఎఫ్​సీడీఏ), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Future City Telangana | గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా..

మంత్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టును ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ఎఫ్​సీడీఏ కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీల పై గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్​సీడీఏ) కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కి సంబంధించిన తేదీల పై గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Future City Telangana

Future City Telangana | అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..

ఫ్యూచర్ సిటీలో ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో పనిచేస్తోందని పొంగులేటి తెలిపారు. ఇది రాబోయే తరాలకు ఆధునిక తెలంగాణ నిర్మాణానికి నాంది పలుకుతుందని వివరించారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన వెల్లడించారు.

Future City Telangana | కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి వివరించారు. గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ కె.శశాంక, మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి, ఐపీఎస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Future City Telangana

ఇది కూడా చదవండి..: Samagra Sanksema Card | ప్రతి ఒక్కరికి ‘సమగ్ర సంక్షేమ కార్డు’ : సీఎం రేవంత్​

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 30 Horoscope | కష్టాలకు ఇక ఎండ్​ కార్డ్​.. ఈ రాశుల వారికి నేడు ఆకస్మిక ధన యోగం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 30 Horoscope | గ్రహాల సంచారంలో వస్తున్న...

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...