Claw Culture | దేశంలోనే మొదటి క్లా ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రం.. భాగ్యనగరంలో గ్రాండ్ ఓపెనింగ్

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Claw Culture | భాగ్యనగర యువతకు సరికొత్త వినోదాన్ని పరిచయం చేస్తూ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక ‘క్లా ఎక్స్పీరియన్స్’ బ్రాండ్ ‘క్లా కల్చర్’ (Claw Culture) తన ఫ్లాగ్‌షిప్ ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రాన్ని ప్రారంభించింది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన హైదరాబాద్‌లోని ( hyderabad) శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో సుమారు 3,500 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ అత్యాధునిక గేమ్ జోన్‌ను ఏర్పాటు చేశారు. భారతదేశ అవుట్-ఆఫ్-హోమ్ వినోద రంగంలోనే ఇదొక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది.

Claw Culture | జెన్ జీ, మిలీనియల్స్ టార్గెట్‌గా..

ప్రస్తుత తరం (Gen Z), మిలీనియల్స్, జంటలు, పాప్-కల్చర్ లవర్స్ , ఫ్యామిలీస్ టార్గెట్‌గా ఈ క్లా కల్చర్ సెంటర్‌ను డిజైన్ చేశారు. ఇక్కడి ప్రతి అంశాన్ని సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకునేలా, కెమెరా , ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌కు ప్రాధాన్యతనిచ్చేలా (Social-First Design) విలాసవంతమైన లైటింగ్‌తో ముస్తాబు చేశారు. సాధారణ ఆర్కేడ్ గేమింగ్ జోన్‌లలా కాకుండా, ఇది పూర్తిగా 100% క్లా మెషీన్ల థీమ్‌పైనే నడుస్తుంది.

Claw Culture

Claw Culture | ఈ హబ్‌లోని ముఖ్య విశేషాలు..

వివిధ రకాల కష్టతర స్థాయిలతో కూడిన 70కి పైగా అడ్వాన్స్‌డ్ మెషీన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు.ఇక్కడి వినూత్న ప్రైజ్ వాల్‌లో ట్రెండింగ్ గాడ్జెట్స్, లగ్జరీ ఐటమ్స్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ ఉంటాయి. వీటిని ప్రతి వారం అప్‌డేట్ చేస్తారు. ఇక్కడ భౌతిక టోకెన్లు, చిల్లర డబ్బుతో పనిలేదు. అంతా డిజిటల్ గేమ్‌కార్డ్ సిస్టమ్ ద్వారానే సాగుతుంది. గేమ్స్ ఆడటం, రీలోడ్ చేయడం, గెలిచిన బహుమతులను మార్చుకోవడం అన్నీ ఖాతాకే అనుసంధానించబడి ఉంటాయి. చిన్న చిన్న బహుమతులను రీడీమ్ చేయడం ద్వారా అరుదైన, ఆకర్షణీయమైన పెద్ద ట్రోఫీలను గెలుచుకునే సదుపాయం కలెక్టర్ల కోసం ప్రత్యేకంగా ఉంది. పుట్టినరోజు వేడుకలు, కాలేజీ గ్రూప్ ఈవెంట్స్, కార్పొరేట్ టీమ్ ఔటింగ్స్ కోసం ప్రత్యేక హోస్ట్‌లతో కూడిన కస్టమ్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
Claw Culture

Claw Culture | హైదరాబాద్ అందుకే ఫస్ట్ ఛాయిస్..

భారతదేశంలో వినోద రంగం సరికొత్త మార్పును కోరుకుంటోందని క్లా కల్చర్ సీఈఓ సిల్వియో లీడ్కే (Silvio Liedtke) ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజలు కేవలం షాపింగ్‌కే పరిమితం కాకుండా.. తాము స్వయంగా ఆడుతూ, గెలుస్తూ, ఆ క్షణాలను పంచుకోవడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు. టోక్యో, సియోల్, షాంఘై, దుబాయ్ నగరాల తరహాలోనే.. ఇలాంటి వినూత్న బ్రాండ్‌ను ఆదరించే ఎనర్జీ, సాంస్కృతిక స్వేచ్ఛ హైదరాబాద్ ప్రేక్షకుల్లో పుష్కలంగా ఉన్నాయని, అందుకే తమ మొదటి కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే 12 నెలల్లో ఈ ప్రత్యేకమైన వినోద అనుభవాన్ని దేశంలోని ఇతర ప్రధాన మహానగరాలకు కూడా విస్తరించనున్నట్లు బ్రాండ్ ప్రతినిధులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: KTR Challenge | 20 లక్షల ఇళ్లు కట్టాకే ఓట్లు అడగండి.. పొంగులేటిపై కేటీఆర్ ఫైర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *