Tree Fell on SUV | కారుపై కూలిన చెట్టు.. తప్పిన ప్రమాదం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tree Fell on SUV | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో వేగంగా వెళ్తున్న ఎస్‌యూవీపై ఒక భారీ చెట్టు కూలిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

నగరంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. అయితే వివేకానంద నగర్​ (Vivekananda Nagar) మీదుగా వెళ్తున్న ఎస్​యూవీ కారుపై ఒక్కసారిగా భారీ వృక్షం పడిపోయింది. చెట్టు అకస్మాత్తుగా కూలి నేరుగా దానిపై పడింది. దీంతో వాహనం ధ్వంసమైంది. అయితే లోపల ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు.

Tree Fell on SUV | ట్రాఫిక్​ జామ్

ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు కారులోని వారిని బయటకు తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన జరిగిన వెంటనే, పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కూలిపోయిన చెట్టును తొలగించి, రహదారిని క్లియర్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

ఇది కూడా చదవండి..: KBR Park One Way Trial | ట్రాఫిక్​ నియంత్రణకు చర్యలు : సీపీ సజ్జనార్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *