Rakesh Reddy Comments | ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మూర్​లో నిరసన ర్యాలీ చేపడితే లా అండ్ ఆర్డర్ సమస్య ఏంటని పోలీసులను ప్రశ్నించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి : Rakesh Reddy Comments | ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్​ (Armoor)లో కొందరు అల్లర్లు చెలరేపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా ర్యాలీ చేపట్టడానికి వెళ్తున్న తనను అడ్డుకోవడంపై పోలీసులతో వాగ్వాదం చేశారు.

ఆర్మూర్​లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసనకు బయలుదేరిన ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డిని పోలీసులు భిక్కనూరు టోల్​గేట్​ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదం చేశారు. నిరసన ర్యాలీ చేపడితే లా అండ్ ఆర్డర్ సమస్య ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకున్నా ఆర్మూర్‌కు వెళ్లి నిరసన ర్యాలీలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఇది హిందూ దేశం అని, ఆర్మూర్‌లో హిందూ కుటుంబాలందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చేందుకే ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.

Rakesh Reddy Comments | మేము మదర్సాలకు వెళ్తున్నామా

ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో హిందూ కుటుంబంపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టిన ఘటనను ప్రస్తావిస్తూ పోలీసుల తీరుపై ప్రశ్నలు సంధించారు. హిందూ పిల్లలకు పాఠశాలల్లో ఉర్దూ నేర్పడం, నమాజ్ చేయించడం ఎక్కడి పద్ధతి అని ఆగ్రహించారు. తాము మదర్సాలు, దర్గాలకు వెళ్లి వారి పిల్లలకు హనుమాన్ చాలీసా, గాయత్రి మంత్రాలు నేర్పిస్తున్నామా అని నిలదీశారు. భారతదేశం హిందూ దేశమని, ఈ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వదలకపోతే సీపీతో మాట్లాడి అయినా ర్యాలీలో పాల్గొంటానని, లేనిపక్షంలో టోల్‌గేట్ వద్దనే రోడ్డుపై కూర్చుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Rakesh Reddy Comments | వారు హత్యలు చేయొచ్చా..

Rakesh Reddy Comments

ఓ వర్గం వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్​ను హత్య చేసింది ఎవరని ప్రశ్నించారు. ఆ వర్గం వారు హత్యలు చేయొచ్చా అన్నారు. ఎక్సైజ్​ కానిస్టేబుల్ నవ్యను కారుతో ఢీకొట్టి చంపారన్నారు. అప్పుడు ఏం చేశారని నిలదీశారు. తన నియోజకవర్గంలో తాను శాంతియుతంగా ర్యాలీ తీయడానికి వెళ్తే అడ్డుకోవడం సరికాదన్నారు.

ఇది కూడా చదవండి..: Tractor Overturn Accident | అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *