Home Birth Tragedy | యూట్యూబ్ చూసి ఇంట్లోనే ప్రసవం.. నిండు ప్రాణం బలి

యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే కాన్పు చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చివరకు ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో వెలుగుచూసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Home Birth Tragedy | యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే కాన్పు చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చివరకు ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని ( Tamil Nadu )  తిరుప్పూర్ జిల్లాలో వెలుగుచూసింది.

Home Birth Tragedy | అసలేం జరిగిందంటే..

ఉతుకులి సమీపంలోని పుంజై తలవాయిపాళ్యానికి చెందిన శశికళ (32) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రెండోసారి గర్భం దాల్చారు. గతంలో సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగినప్పుడు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో, ఈసారి ఎలాగైనా ‘నార్మల్ డెలివరీ’ అవ్వాలని ఆమె మొండిగా నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఆస్పత్రికి వెళ్లమని చెప్పినా వినకుండా, యూట్యూబ్ వీడియోల ఆధారంగా ఇంట్లోనే ప్రసవం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Home Birth Tragedy | విషాదాంతం..

జూన్ 24న తెల్లవారుజామున శశికళకు పురిటి నొప్పులు రావడంతో, యూట్యూబ్ సూచనలను పాటిస్తూ అత్త సహాయంతో ఇంట్లోనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ప్రసవం జరిగిన కొద్దిసేపటికే శశికళకు విపరీతమైన రక్తస్రావం (Hemorrhage) మొదలైంది. పరిస్థితి విషమించి ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను పెరుందురై ప్రభుత్వ ఆస్పత్రికి, ఆపై కోయంబత్తూరులోని రాయల్ కేర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ, పరిస్థితి మెరుగుపడక జూన్ 28న ఉదయం ఆమె కన్నుమూశారు. నవజాత శిశువు మాత్రం ప్రస్తుతం క్షేమంగా ఉంది.

Home Birth Tragedy | దర్యాప్తు ప్రారంభం..

ఈ ఘటనపై కున్నత్తూరు వైద్యాధికారి నిత్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉతుకులి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి వైద్య పర్యవేక్షణ లేకుండా ఇంట్లోనే కాన్పు జరిపించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. మరణానికి కారణమైన పరిస్థితులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Rakesh Reddy Comments | ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *