Telangana School Reopening | విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో స్కూళ్ల రీఓపెనింగ్ వాయిదా

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభం తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌‌డెస్క్: Telangana School Reopening | తెలంగాణలోని ( Telangana )  పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభం తేదీని మారుస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా, మరికొన్ని రోజులు ఆలస్యంగా స్కూళ్లు తెరుచుకోనున్నాయి.

Telangana School Reopening | జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం..

రాష్ట్రంలోని 2026-27 విద్యా సంవత్సర అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. తొలుత జూన్ 12న స్కూళ్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే, జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం సెలవులు వచ్చాయి. కేవలం జూన్ 12 (శుక్రవారం) ఒక్క రోజు మాత్రమే స్కూలు తెరిచి, ఆ వెంటనే వరుసగా రెండు రోజులు సెలవులు రానుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు వచ్చాయి. ఈ అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, రీఓపెనింగ్ తేదీని జూన్ 15 (సోమవారం)కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

school 1

Telangana School Reopening | ఆ శనివారం స్కూలు ఉంటుంది..

పాఠశాలల ప్రారంభం ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు నష్టపోయే పనిదినాలను భర్తీ చేసేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెల జులై 11న వచ్చే రెండో శనివారం సెలవును రద్దు చేశారు. ఆ రోజును సాధారణ పనిదినంగా మారుస్తూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

school.2

 

Telangana School Reopening | అధికారులకు ఆదేశాలు..

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు, జిల్లాల డీఈఓలు (DEO) తమ పరిధిలోని అన్ని స్కూళ్లకు చేరవేసి, ఉత్తర్వులు పక్కాగా అమలయ్యేలా చూడాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులకు అదనంగా మరికొన్ని రోజులు సెలవుల ఊరట లభించినట్లయింది.

ఇది కూడా చదవండి:  Peddi Box Office | బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సునామీ.. మూడు రోజుల్లోనే సరికొత్త రికార్డు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *