Peddi Box Office | బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సునామీ.. మూడు రోజుల్లోనే సరికొత్త రికార్డు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Peddi Box Office | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, మొదటి ఆట నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకు సంబంధించిన మొదటి మూడు రోజుల అధికారిక వసూళ్ల వివరాలను తాజాగా ప్రకటించింది.

Peddi Box Office | మూడు రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్క్ క్రాస్..

ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 236.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ కలెక్షన్లతో సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ. 200 కోట్ల మైలురాయిని చాలా సులువుగా దాటేసింది.
peddi.1

 

Peddi Box Office | టార్గెట్ రూ. 300 కోట్లు..

ప్రస్తుతం థియేటర్ల వద్ద కనిపిస్తున్న విపరీతమైన క్రేజ్, కలెక్షన్ల జోరును బట్టి చూస్తే, ఈ చిత్రం నాలుగో రోజు నాటికే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్‌లో ఈ సినిమా మెగా పవర్ స్టార్ కెరీర్‌లోనే మరిన్ని భారీ రికార్డులను సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

peddi.2

Peddi Box Office | భారీ తారాగణం..

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక వినూత్న స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఇది కూడా చదవండి:  Fish Prasadam Distribution | హైదరాబాద్​లో రేపు చేప ప్రసాదం పంపిణీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *