Godavari Kaveri Link | కొత్తకుట్రకు చంద్రబాబు తెర.. హరీశ్​రావు

గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్రం స్పష్టం చేసిందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. తెలంగాణ భవన్​లో ఆయన మాట్లాడారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari Kaveri Link | గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్రం స్పష్టం చేసిందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. మిగులు జలాల మీద డీపీఆర్ (DPR) ఆమోదం తెలపడం సాధ్యం కాదన్నారు. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో గోదావరి కావేరీ నదుల అనుసంధానం అని చంద్రబాబు కొత్త కుట్రకు తెర లేపారని విమర్శించారు.

తెలంగాణ భవన్​లో హరీశ్​రావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మక్క సారక్క ప్రాజెక్టు నుంచి నదుల అనుసంధానం మొదలు అవ్వాలని ప్రతిపాదించామన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) కుట్రతో అసలు తెలంగాణ భూభాగానికి సంబంధం లేకుండానే నదుల అనుసంధానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు.

Godavari Kaveri Link | బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు

brs 2

ఏపీ ప్రభుత్వం తమకు ఆదర్శం అని చెప్పే KL Rao కూడా నదుల అనుసంధానం తెలంగాణ నుంచి చేయాలని చెప్పారని హరీశ్​రావు (Godavari Kaveri Link) అన్నారు. ఏపీ బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని కీలు బొమ్మ లాగా ఆడిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా చూస్తున్నారని విమర్శించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నాయన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా సమ్మక్క సారక్క నుంచి నాగార్జున సాగర్ అక్కడి నుంచి సోమశిల తరలించి కావేరీ నదికి అనుసంధానం చేసేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. కానీ నేడు ఏపీ ప్రభుత్వం నీళ్లను తరలించుకు పోతుంటే కాంగ్రెస్​ ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు.

దీనిని కూడా చదవండి : Fish Prasadam Distribution | హైదరాబాద్​లో రేపు చేప ప్రసాదం పంపిణీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *