Amazon Influencer Program | అమెజాన్ ఇన్ ఫ్లూయెన్సర్ ప్రోగ్రామ్ సంచలనం.. 2 లక్షలు దాటిన క్రియేటర్లు!

అమెజాన్ ఇన్ ఫ్లూయెన్సర్ ప్రోగ్రామ్ ప్రతీ ఏటా రెట్టింపు అవుతూ.. భాగస్వామ్య సృష్టికర్తల (క్రియేటర్ల) సంఖ్య ఏకంగా 2 లక్షలు దాటిందని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Amazon Influencer Program | అమెజాన్ ఇన్ ఫ్లూయెన్సర్ ప్రోగ్రామ్ ప్రతీ ఏటా రెట్టింపు అవుతూ.. భాగస్వామ్య సృష్టికర్తల (క్రియేటర్ల) సంఖ్య ఏకంగా 2 లక్షలు దాటిందని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. Amazon.in వేదికగా మాత్రమే కాకుండా, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్ ద్వారా డిజిటల్ వ్యాపారాలను రూపొందించుకోవడానికి ఇది సృష్టికర్తలకు విస్తృత అవకాశాలను కల్పిస్తోంది.

ఇకపై క్రియేటర్లు తమ యూట్యూబ్  ( YouTube ) , పింటరెస్ట్ కంటెంట్‌లో నేరుగా అమెజాన్ ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు. దీనివల్ల వారి కంటెంట్ ఆధారంగా జరిగే కొనుగోళ్లపై కమీషన్లు సంపాదించడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వినియోగదారులు సరైన షాపింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడవచ్చు.

Amazon Influencer Program | కీలక పాత్ర..

సృష్టికర్తలు కేవలం ఉత్పత్తులను పరిచయం చేయడమే కాకుండా.. వినియోగదారులను ప్రేరేపించడం, ఉత్పత్తుల ఆవిష్కరణ, సరైన నిర్ణయం తీసుకోవడం , కొనుగోలు చేయడం వరకు ప్రతి దశలోనూ కీలక బాధ్యత వహిస్తున్నారు. ఈ ఏడాది అమెజాన్‌లో వందల మిలియన్ల ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో క్రియేటర్లు దాదాపు 40 మిలియన్ల (4 కోట్లు) కస్టమర్లకు మార్గదర్శకంగా నిలిచారు. పండగ సీజన్ సందర్భంగా జరుగుతున్న ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’తో ఈ కొనుగోళ్లు మరింత పెరగనున్నాయి.

Amazon Influencer Program | నాన్-మెట్రో నగరాల్లోనే ..

అమెజాన్ నిర్వహించిన అంతర్గత విశ్లేషణలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. క్రియేటర్ల సిఫార్సుల ద్వారా ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న వారిలో దాదాపు 70 శాతం మంది గుంటూరు, డెహ్రాడూన్, భువనేశ్వర్, పాటియాలా వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి (నాన్-మెట్రో) నగరాలకు చెందినవారే కావడం గమనార్హం. అలాగే ఈ ప్రోగ్రామ్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సృష్టికర్తలలో 75 శాతం మంది కాంచీపురం, మీరట్, జమ్మూ, నాసిక్ వంటి నాన్-మెట్రో ప్రాంతాల నుంచే వస్తున్నారు. అంతేకాకుండా, ప్రతీ క్రియేటర్‌కు లభించే సగటు ఆదాయం ఏడాదికి 60 శాతం మేర పెరిగిందని, ఇది అమెజాన్ ద్వారా స్థిరమైన డిజిటల్ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చనే నమ్మకాన్ని పెంచుతోందని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.

Amazon Influencer Program | ప్రతినిధుల స్పందనలు..

అమెజాన్ సోషల్ కామర్స్ ప్రధాన అధికారి – నిధి ఠక్కర్ స్పందన:
“ఈ రోజుల్లో కస్టమర్లు ఉత్పత్తులను శోధించే , కొనుగోలు చేసే విధానాన్ని క్రియేటర్లు పూర్తిగా మార్చేస్తున్నారు. అమెజాన్ ఇన్ ఫ్లూయెన్సర్ ప్రోగ్రామ్ ద్వారా క్రియేటర్ల అభిరుచిని వ్యాపారంగా మార్చేందుకు తోడ్పడుతున్నాం. యూట్యూబ్, పింటరెస్ట్ వంటి భాగస్వాములతో కలిసి దేశ నలుమూలలా ఉన్న కథకుల సామర్థ్యానికి పదునుపెట్టి, వినియోగదారులకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం” అని నిధి ఠక్కర్ పేర్కొన్నారు.

యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ – గుంజన్ సోనీ స్పందన:
“యూట్యూబ్ షాపింగ్ ప్రోగ్రామ్‌లోకి అమేజాన్‌ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో 450 మిలియన్లకు పైగా ప్రజలు షాపింగ్ సంబంధిత సమాచారం కోసం యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ భాగస్వామ్యం వల్ల క్రియేటర్లు తమ షార్ట్స్, లాంగ్ వీడియోలు, లైవ్ స్ట్రీమ్స్‌లో ఉత్పత్తులను ట్యాగ్ చేసి నమ్మకమైన ఆదాయాన్ని పొందవచ్చు. ప్రేక్షకులకు కూడా తాము విశ్వసించే క్రియేటర్ల ద్వారా సులభంగా కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది” అని గుంజన్ సోనీ తెలిపారు.

లైఫ్‌స్టైల్ క్రియేటర్ – బుధభూషణ్ పి ఖోబ్రగడే అభిప్రాయం..
“క్రియేటర్‌గా నా సబ్‌స్క్రైబర్లకు సరైన ఉత్పత్తులను సమీక్షించి, వారు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడడమే నా ప్రాధాన్యత. అమేజాన్ తెచ్చిన ఈ కొత్త ఇంటిగ్రేషన్ వల్ల నా యూట్యూబ్ కంటెంట్‌ను చూస్తూనే, ప్రేక్షకులు కేవలం ఒక్క క్లిక్‌తో అమెజాన్‌లో ఆ వస్తువులను సులభంగా కొనుగోలు చేయగలుగుతున్నారు” అని హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  Eagle Force Raid | ఈగల్​ ఫోర్స్​ భారీ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *