అక్షరటుడే, వెబ్డెస్క్ : Eagle Force Raid | తెలంగాణలో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. అంతర్రాష్ట్ర సింథటిక్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసింది. మహారాష్ట్రలో దాడులు చేసి 11 మంది నిందితులను అరెస్ట్ చేసింది.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్, గంజాయి దందా జోరుగా సాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి మాదకద్రవ్యాలు తీసుకొచ్చి నగరంలో విక్రయాలు చేపడుతున్నారు. ఈగల్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు, ఎస్వోటీ (SOT) పోలీసులు దాడులు చేస్తున్న డ్రగ్స్ దందా ఆగడం లేదు. ఎంత మందిని అరెస్ట్ చేస్తున్న విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. దీంతో వీటికి అలవాటు పడి యువత, విద్యార్థులను జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈక్రమంలో పోలీసులు డ్రగ్స్ మూలాలు గుర్తించే పనిలో పడ్డారు.
Eagle Force Raid | ఇతర రాష్ట్రాల్లో..
డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన వారి ఆధారంగా అధికారులు.. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుంటున్నారు. అనంతరం అక్కడకు వెళ్లి దాడులు చేపడుతున్నారు. ఇటీవల గోవా (Goa)లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి పరారీలో ఉన్న నిందితుడు కస్టోడియో ఫెర్నాండెజ్ అలియాస్ క్రిస్టీని పట్టుకున్నారు. తాజాగా మహారాష్ట్రలో సోదాలు చేశారు. రహస్య డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుర్తించారు. పౌల్ట్రీ ఫామ్‌లో అక్రమంగా డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు తెలిపారు. ఓ కారులో 27.2 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. 56.98 కిలోల అసిటోన్‌ను సీజ్ చేశారు. 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో 13 మంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
దీనిని కూడా చదవండి : Indian Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు.. రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి