అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market Crash | జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతుండడంతో ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 108 డాలర్ల సమీపంలో ట్రేడ్ అవడంతో మార్కెట్‌పై ఒత్తిడి నెలకొంది. దీనికితోడూ రెండో త్రైమాసిక ఫలితాల తర్వాత పెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు ప్రధాన సూచీలను దెబ్బతీశాయి.
Indian Stock Market Crash | ఫ్లాట్‌గా ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 120 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా నిలదొక్కుకోలేకపోయింది. అక్కడినుంచి క్రమంగా పతనమవుతూ ఇంట్రాడేలో 1,141 పాయింట్లు కోల్పోయింది. 4 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమైన నిఫ్టీ.. మొదట్లో మరో29 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 330 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 876 పాయింట్ల నష్టంతో 73,852 వద్ద, నిఫ్టీ 257 పాయింట్ల నష్టంతో 23,888 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,329 కంపెనీలు లాభపడగా 3,092 స్టాక్స్ నష్టపోయాయి. 237 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 123 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 221 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈ లో నమోదైన కంపెనీల సంపద విలువ సుమారు రూ. 5 లక్షల కోట్లు ఆవిరయ్యింది.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 4 కంపెనీలు లాభాలతో, 25 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. మారుతి ఫ్లాట్‌గా ఉంది. ఎస్బీఐ 1.12 శాతం, అదానీపోర్ట్స్ 1.07 శాతం, ఎల్టీ 0.61 శాతం, ఇండిగో 0.24 శాతం పెరిగాయి.
Top Losers : యాక్సిస్ బ్యాంక్ 3.85 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.82 శాతం, ఇన్ఫోసిస్ 2.72 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.54 శాతం, ట్రెంట్ 2.43 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Samsung Galaxy F70 5G | శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్.. రేపటి నుంచి అమ్మకాలు ప్రారంభం.