Samsung Galaxy F70 5G | శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్.. రేపటి నుంచి అమ్మకాలు ప్రారంభం.

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎఫ్ 70 5జీ పేరుతో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 20న అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samsung Galaxy F70 5G | సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ అయిన శాంసంగ్ భారత మార్కెట్ లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎఫ్ 70 5జీ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే శాంసంగ్ ఎక్సినాస్ 1330 ప్రాసెసర్ అమర్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాలతో వచ్చిన ఈ ఫోన్ ఫస్ట్ సేల్ అక్టోబర్ 20 న ప్రారంభం కానుంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ తోపాటు ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

డిస్‌ప్లే : 6.7 ఇంచ్ ఎఫ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్.. 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1080 2340 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇస్తుంది. ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ ఉంది.

ప్రాసెసర్ : శాంసంగ్ ఎక్సినాస్ 1330 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యÖఐ 7 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. నాలుగు ఆండ్రాయిడ్ జనరేషన్లు, ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ ప్రకటించింది.

Samsung Galaxy F70 5G | కెమెరా సెటప్..

వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సార్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.

బ్యాటరీ : 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 25డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy F70 5G | రెండు వేరియంట్లలో..

  • గెలాక్సీ ఎఫ్ 70 5జీ ఫోన్ వివిధ్ వయోలెట్, బోల్డ్ బ్లాక్ కలర్స్‌లో రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
  • 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999.
  • 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999.
  • ఎంపిక చేసిన కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 2 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో అదనంగా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: Airtel Voice Plans | ఎయిర్‌టెల్ నుంచి వాయిస్ ప్లాన్లు.. డేటా అవసరంలేనివారికి ప్రయోజనం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *