May 14 Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్న సెన్సెక్స్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 14 Market Analysis | టెక్ స్టాక్స్ మద్దతుతో వాల్‌స్ట్రీట్(Wallstreet) రికార్డ్ స్థాయి గరిష్టాల వద్ద కొనసాగుతోంది. గత సెషన్‌లో యూరోప్ మార్కెట్లు సైతం లాభాలతో ముగిశాయి.

ప్రధాన ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

May 14 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 1.20 శాతం, ఎస్ అండ్ పీ 0.59 శాతం లాభపడ్డాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.23 శాతం లాభంతో ఉంది.

May 14 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.75 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.58, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.35 శాతం శాతం పెరిగాయి.

May 14 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.98 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 0.92 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.74 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.30 శాతం లాభాలతో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై 0.62 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.23 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.50 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు పాజిటివ్ గా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా ఏడో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,703 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా పదమÖడో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,869 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.93 వద్ద ఉంది.
  • విక్స్ 0.75 శాతం పెరిగి 19.43 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.75 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.49 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.46 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 95.70 వద్ద ఉంది.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

Rabi Paddy Procurement | ముమ్మరంగా వరి కొనుగోళ్లు.. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.. రైతుల ఖాతాల్లో రూ.4,520 కోట్లు జమ!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *