UP Storm Deaths | యూపీలో తుపాను బీభత్సం.. 74 మంది మృతి!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UP Storm Deaths | యూపీలో గాలివాన బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న అతిభారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్తు స్థంభాలు నేలకొరిగాయి.

పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారుల మీద ప్రయాణిస్తున్న వాహనాలపై విరిగిపడిన భారీ వృక్షాలతో ఎక్కడ చూసిన భయానక పరిస్థితులు దర్శనం ఇస్తున్నాయి.

UP Storm Deaths | దెబ్బతిన్న పంట..

భారీ వర్షాలకు 74 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ప్రయాగ్‌రాజ్‌, ఫతేపూర్‌, కాన్పూర్‌, దేహత్‌ వంటి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. చేతికొచ్చే సమయంలో నేలరాలిన పంటను చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

కాగా, రానున్న 48 గంటల్లో ఉత్తర్​ ప్రదేశ్​లో మరిన్ని భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

NEET Paper Leak | విద్యార్థుల గొంతుకపై ‘లీకేజీ’ కత్తి.. నీట్ కుంభకోణం వెనుక అసలు దందా ఇదేనా?

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *