క్రీడలుVirat Kohli Century | రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. విరాట్ సెంచరీతో సంచలన విజ‌యం...

Virat Kohli Century | రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. విరాట్ సెంచరీతో సంచలన విజ‌యం సాధించిన ఆర్సీబీ

విరాట్ కోహ్లీ విధ్వంసక సెంచరీతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఐపీఎల్ 2026లో అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Virat Kohli Century | ఐపీఎల్ 2026 సీజన్ మరింత ఉత్కంఠగా మారుతోంది. బుధవారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆర్‌సీబీ (Royal Challengers Bengaluru) అసాధారణ ప్రదర్శనతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోర్ నమోదు చేసినప్పటికీ, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ముందు ఆ లక్ష్యం చిన్నదిగా మారిపోయింది.

ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన కోహ్లీ, కేకేఆర్ KKR బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కేవలం 58 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన ఆయన, ఇన్నింగ్స్ మొత్తం 11 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో అలరించాడు. చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన కోహ్లీ, ఈ మ్యాచ్‌లో సెంచరీతో ఘనంగా కమ్‌బ్యాక్ ఇవ్వడం అభిమానులను ఉర్రూతలూగించింది.

Virat Kohli Century | స‌రికొత్త రికార్డులు..

ఈ సెంచరీతో కోహ్లీ అరుదైన రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లీకి ఇది మొత్తం 10వ టీ20 సెంచరీ కాగా, గతంలో 9 సెంచరీలతో ఉన్న అభిషేక్ శ‌ర్మ Abhishek Sharma రికార్డును అధిగమించాడు. ఐపీఎల్‌లో మాత్రం ఇది కోహ్లీకి 9వ సెంచరీ కావడం విశేషం. ఈ జాబితాలో కేఎల్ రాహుల్, రోహిత్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ చెరో 8 సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Virat Kohli Century | ఆర్‌సీబీ నెలకొల్పిన రికార్డు కూడా ప్రత్యేకమే

ఇక రాయ్‌పూర్ స్టేడియం (Raipur Stadium)లో ఆర్‌సీబీ నెలకొల్పిన రికార్డు కూడా ప్రత్యేకమే. ఐపీఎల్ చరిత్రలో ఈ మైదానంలో ఇదే అతిపెద్ద విజయవంతమైన రన్ ఛేజ్. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సీజన్‌లోనే ముంబై ఇండియన్స్‌పై 167 పరుగులు ఛేజ్ చేసి రికార్డు సృష్టించిన ఆర్‌సీబీ, ఇప్పుడు ఆ రికార్డును తామే బద్దలు కొట్టడం విశేషం. మరోవైపు కేకేఆర్ ఓడిపోయినప్పటికీ కొన్ని పాజిటివ్ అంశాలు కనిపించాయి. ముఖ్యంగా యువ బ్యాటర్ ర‌ఘువంశి 71 పరుగులతో జట్టుకు అండగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ కేకేఆర్ అభిమానుల్లో ఇంకా ఆశలు మిగిలేలా చేసింది. ఈ విజయంతో ఆర్‌సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాకపోయినా, బెంగళూరు దాదాపు తదుపరి దశకు చేరినట్టే కనిపిస్తోంది. ఇక కేకేఆర్ పరిస్థితి మాత్రం క్లిష్టంగా మారింది. మిగిలిన మూడు మ్యాచుల్లో భారీ విజయాలు సాధిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి..: SRH Playoffs Scenario | గుజరాత్‌పై చిత్తుగా ఓడిన ఎస్ఆర్‌హెచ్.. హైద‌రాబాద్ జ‌ట్టుకి ప్లేఆఫ్స్ చేరుకోవ‌డం క‌త్తి మీద సామే..!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Chandrababu Convoy Reduction | ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ కుదింపు

అక్షరటుడే, వెబ్​డెస్క్:Chandrababu Convoy Reduction | ఆంధ్ర ప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు...

Flight Ticket Prices | ప్రయాణం ‘గగన’మే!.. గణనీయంగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Flight Ticket Prices | అమెరికా -ఇజ్రాయెల్ కూటమి...

Bachupally Gandimaisamma Road | బాచుపల్లి– గండిమైసమ్మ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bachupally Gandimaisamma Road | హైదరాబాద్​ (Hyderabad) నగర...