Travis Head Wife Trolls | ట్రావిస్ హెడ్ భార్యపై సోషల్ మీడియాలో వేధింపులు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Travis Head Wife Trolls | సన్​ రైజర్స్​ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ​ ఓపెనర్​ ట్రావిస్​ హెడ్​ భార్యపై కొందరు సోషల్​ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్నారు. ఆమెపై అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారు.

హైదరాబాద్ (Hyderabad)​లో ఇటీవల ఎస్​ఆర్​హెచ్​, ఆర్సీబీ మధ్య మ్యాచ్​ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​లో హెడ్​, కోహ్లీ మధ్య మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్​ అనంతరం హెడ్​కు విరాట్​ షేక్​ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో కోహ్లీ అభిమానులు ట్రావిస్​ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ట్రోలింగ్​ చేస్తున్నారు. తనపై దాడులు చేస్తామని బెదిరింపులతో పాటు, సన్నిహితులు, కుటుంబ సభ్యులపై ట్రోల్స్ చేస్తున్నారని ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా హెడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Travis Head Wife Trolls | కోహ్లీ అభిమానుల ట్రోలింగ్​

Travis Head Wife Trolls

ఆర్సీబీతో మ్యాచ్​లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మ్యాచ్​ మధ్యలో విరాట్​ కోహ్లీ (Virat Kohli), హెడ్​ (Head) మధ్య చిన్న గొడవ జరిగింది. అయితే దీనికి కారణం ఏమిటో ఇంకా తెలియదు. కానీ మ్యాచ్​ తర్వాత విరాట్​ షేక్​ హ్యాండ్​ ఇవ్వడకపోవడంతో వివాదం పెద్దదిగా మారింది. అయితే మ్యాచ్​లో జరిగిన గొడవను ఆటగాళ్లు మరిచిపోయిన వారి అభిమానులు రెచ్చిపోతుండటం గమనార్హం. కోహ్లీ అభిమానులు ఏకంగా హెడ్​ భార్యను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్​కు వెళ్లి పచ్చి బూతులు తిడుతున్నారు. హెడ్​ భార్యకు ఎస్​ఆర్​హెచ్​ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. మైదానంలో జరిగిన గొడవకు ఆమెకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Hardik Pandya Captaincy | ముంబై పతనానికి హార్దిక్ కెప్టెన్సీనే కారణమా?.. ఐపీఎల్ 2026లో ఘోర వైఫల్యంపై చర్చలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *