అక్షరటుడే, వెబ్‌డెస్క్: India vs Sri Lanka | శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్‌లో భారత బౌలర్లు విజృంభించారు. తొలుత బ్యాట్‌తో చెలరేగిన టీమిండియా(Team India).. తర్వాత బాల్‌తో రెచ్చిపోవడంతో లంచ్ బ్రేక్ సమయానికి లంక జట్టు 5 వికెట్లు కోల్పోయింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 460 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మూడో రోజు భారత ఆటగాళ్లు రెండు పరుగులు మాత్రమే చేశారు. భారత్ 462 పరుగులు చేసింది. అనంతరం ఆలౌట్ కావడంతో లంక బ్యాటింగ్‌కు వచ్చింది. ఆదినుంచి భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో 100 పరుగులు కాకముందే ఆతిథ్య జట్టు 5 వికెట్లు కోల్పోయింది.
India vs Sri Lanka | తొలి ఓవర్లోనే..
శ్రీలంక తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో(0)ను మహమ్మద్ సిరాట్ ఔట్ చేశాడు. లహిర ఉదర 27 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతడిని మానవ్ సుతార్ పెవిలియన్‌కు పంపించాడు. లంచ్ బ్రేక్ సమయానికి లంక 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. క్రీజులో సోనాల్ దినూషా, నిరోషన్ ఉన్నారు. సిరాజ్, కులదీప్, మానవ్‌సుతార్, రవీంద్ర జడేజా వికెట్లు తీశారు.
ఇది కూడా చదవండి..: India vs Sri Lanka | శ్రీలంకతో టెస్ట్.. భారత్ భారీ స్కోర్