Basketball Team | రాష్ట్రస్థాయి బాస్కెట్​బాల్ పోటీలకు జిల్లా జట్టు

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Basketball Team | జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 11వ రాష్ట్రస్థాయి బాస్కెట్​ బాల్ (Basketball)​ పోటీలు జరుగనున్నాయి. నగరంలోని కాకతీయ ఒలింపియాడ్​కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు.

Basketball Team | విద్యార్థులకు అభినందన

కాకతీయ ఒలింపియాడ్​కు (Kakatiya Olympiad) చెందిన క్రీడాకారిణులు బర్కుంట హాసిని, వంశికలు తమ ప్రతిభతో బాస్కెట్​బాల్​ జట్టుకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయిలో చూపిన ప్రతిభ ఆధారంగా వారు జట్టులో స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా వీరిని పాఠశాల డైరెక్టర్​ రజనీకాంత్​, ప్రిన్సిపాల్​ చంద్రశేఖర్​, కోచ్​ అరుణ్​ అభినందించారు. కాగా కోచ్​ విశాల ఆధ్వర్యంలో జిల్లా జట్టు జయశంకర్​ భూపాలపల్లికి బయలుదేరి వెళ్లింది. మూడు రోజులపాటు అక్కడ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న జిల్లాజట్టుకు నిజామాబాద్​ బాస్కెట్​బాల్​ అసోసియేషన్​ శుభాకాంక్షలు తెలిపింది.

ball ball1

ball22

ఇది కూడా చదవండి: Ponguleti Key Comments | ఏ శాఖ ఇచ్చిన పని చేస్తా.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *