Ponguleti Key Comments | ఏ శాఖ ఇచ్చిన పని చేస్తా.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ponguleti Key Comments | గచ్చిబౌలిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణ పనులను గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

మంత్రుల శాఖాల మార్పుపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. తనకు ఏ శాఖ ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తానని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఏ ఫైల్ పై గుడ్డిగా సంతకం పెట్టలేదని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ (Revenue Department)లో అక్రమాలకు పాల్పడ్డవారిపై, ఏసీబీ ట్రాప్ (ACB Trap) అయిన వారిపై గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. విచారణ జరగకుండా తప్పు చేసిన వారిని తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

Ponguleti Key Comments | 3,500 ఫైళ్లు క్లియర్​ చేశా

తాను రెవెన్యూ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,500 ఫైళ్లను క్లియర్ చేశానని పొంగులేటి తెలిపారు. తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగిన అసైన్డ్ భూములను ఇప్పుడు నిషేదిత జాబితాలో పెట్టామని వెల్లడించారు. భూములకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్​ను డిజిటలైజేషన్ చేస్తామని వెల్లడించారు.

Ponguleti Key Comments | రిజిస్ట్రేషన్​ చార్జీలు పెంచం

ప్రజలకు వేగవంతంగా పార‌ద‌ర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని మంత్రి స్పష్టంచేశారు. శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం రూ.2.75 లక్షలుగా నిర్ణయించామని, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎకరానికి రూ.5 లక్షలుగా, హెచ్​ఎండీఏ పరిధిలో రూ.10 లక్షలుగా, ఓఆర్ఆర్ పరిధిలో రూ.15 లక్షలుగా నిర్ణయించినట్లు వివరించారు.

Ponguleti Key Comments | రద్దు సాధ్యం కాదు

ఫ్యూచర్ సిటీ రద్దుచేయడం సాధ్యం కాదని మంత్రి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో లాండ్స్ ఫ్రీగా ఇవ్వడం లేదని, రద్దు చేస్తే ప్రభుత్వం డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్​ సిటీ రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్​రావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పొంగులేటి ఆయన వ్యాఖ్యలకు ఖండించారు.

దీనిని కూడా చదవండి : FRO Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *