Harish Rao Statement | రైతుల కోసం రక్తం ఇవ్వడానికి సిద్ధం : హరీశ్​ రావు

రైతులకు నీళ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి తమ రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధం అని హరీశ్​రావు అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Statement | రైతులకు నీళ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మా రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని ఇవ్వడానికి మేము సిద్ధం అని హరీశ్​రావు అన్నారు. తెలంగాణ భవన్​లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్​ రెడ్డి శనివారం కరువు గురించి మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ నాయకులను కోసి ఆ రక్తం పంటలపై చల్లితే పండుతాయని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై హరీశ్​రావు స్పందించారు. రేవంత్ రెడ్డి రక్తపిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనమన్నారు. పాపం పండిన నాడు హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని పేర్కొన్నారు. రైతుల కోసం రక్తం ఇవ్వడానికి, జైలుకి వెళ్లడానికి తాము సిద్ధమే అన్నారు. నీళ్ల అంశంలో ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే కుదరదని స్పష్టం చేశారు.

Harish Rao Statement | అవగాహన లేని సీఎం

రేవంత్ రెడ్డి 31 నెలల్లో బూతులు తప్ప విషయం నేర్చుకోలేదని హరీశ్​రావు విమర్శించారు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయవచ్చు అనే కనీస అవగాహన ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి సోయి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాబాద్ ఘటన మీద పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు కానీ మన ముఖ్యమంత్రి/హోంమంత్రి మాత్రం స్పందించలేదన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే ఓ పోలీస్ ఉన్నతాధికారి గోల్ఫ్ ఆడుతూ టైమ్ పాస్ చేశారని విమర్శించారు.

Harish Rao Statement | 48 లక్షల ఎకరాలకు నీరు

brs 6

ఉన్న విషయం బయటపెడితే రిటైర్డ్ ఇంజనీర్లను జైలులో వేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు చెప్పినట్లు మోటార్లు ఆన్ చేస్తే సీఎం చెప్పిన అబద్ధాలు, దుష్ప్రచారం బయట పడుతుందని నీళ్లు ఇవ్వకుండా అడ్డు పడుతున్నారని పేర్కొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ 48 లక్షల 74 వేల ఎకరాలకు నీళ్లిచ్చిందని వెల్లడించారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని తెలిపారు.

 

దీనిని కూడా చదవండి : Hormuz Strait Closure | మళ్లీ హర్ముజ్​ జలసంధిని మూసేసిన ఇరాన్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *