Hormuz Strait Closure | మళ్లీ హర్ముజ్​ జలసంధిని మూసేసిన ఇరాన్​

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. దీంతో ఇరాన్​ హర్ముజ్​ జలసంధిని మళ్లీ మూసి వేస్తున్నట్లు ప్రకటించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hormuz Strait Closure | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. అమెరికా–ఇరాన్​ పరసర్పం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరాన్​ హర్ముజ్​ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించింది.

హర్ముజ్ జలసంధిలో అనధికారిక మార్గంలో ప్రయాణిస్తున్న ఒక నౌకపై తమ సైన్యం హెచ్చరికగా కాల్పులు జరపడంతో, ఆ జలసంధిని మరోసారి మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అనంతరం ఇరాన్‌పై మూడో విడత దాడులు ప్రారంభించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. జలసంధి తీరంలోని బందర్ అబ్బాస్, సిరిక్ అనే రెండు పట్టణాలలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

Hormuz Strait Closure | నౌకపై దాడి

జలసంధిలో ఇరాన్ (Iran)​ సూచించిన మార్గంలో కాకుండా పలు నౌకలు ఒమన్​ (Oman) తీరం సమీపంలో నుంచి వెళ్తున్నాయి. దీనిపై టెహ్రాన్​ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలా వెళ్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. తాజాగా సైప్రస్ జెండా కలిగిన ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేయగా, దాని ఇంజిన్ రూమ్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. అనంతరం హర్ముజ్​ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్​ ప్రకటించింది. దీంతో గల్ఫ్​ దేశాలతో పాటు అక్కడి నుంచి ముడి చమురు, గ్యాస్​ దిగుమతి చేసుకునే దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Hormuz Strait Closure | అప్పటి వరకు మూసే ఉంటుంది

hormuz

తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జలసంధి మూసివేసే ఉంటుందని, మరిన్ని దాడులు ఎదురైతే ఈ ప్రాంతంలోని అదనపు శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకునే విషయాన్ని పరిశీలిస్తామని ఇరాన్ పేర్కొంది. దీనిపై అమెరికా (America) స్పందించింది. ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దాని మూల్యం చెల్లిస్తోందని యూఎస్​ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా జలసంధిపై ఇరాన్​, ఓమన్​ చర్చలు జరపాడానికి అంగీకరించాయి.

Hormuz Strait Closure | ఇరాన్​ నియంత్రణలో ఉండాలని..

ఈ జలసంధిని ఒక అంతర్జాతీయ జలమార్గంగా ప్రపంచ దేశాలు పరిగణిస్తున్నాయి. అయితే ఇరాన్​ మాత్రం తమ నియంత్రణలోనే ఉండాలని పట్టుబట్టింది. ఒమన్ ప్రాదేశిక జలాల మీదుగా దక్షిణ మార్గంలో ప్రయాణించాలని అమెరికా నౌకలకు సూచిస్తోంది. ఈ క్రమంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. హర్ముజ్​ జలసంధి ప్రారంభం అయిన తర్వాత ముడి చమురు ధరలు భారీగా దిగివచ్చాయి. తాజాగా మళ్లీ హర్ముజ్​ను మూసివేయడంతో ఇంధన ధరలపై ప్రభావం పడనుంది.

ఇది కూడా చదవండి : Vietnam boat accident | విహార యాత్రలో తీరని విషాదం: వియత్నాంలో బోటు బోల్తా.. 18 మంది భారతీయ పర్యాటకుల దుర్మరణం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *