అక్షరటుడే, భీమ్గల్: కమ్మర్పల్లి (Kammerpally) లో చిరుత కళేబరం ఘటన కలకలం రేపింది. ఇటీవల రేంజ్ పరిధిలో తిరుగుతున్న చిరుత మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం రేంజ్లో చర్చనీయాంశమైంది.
Kammerpally Leopard Carcass | గొర్రెను చంపిందనే కోపంతో..
కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో భీమ్గల్(Bheemgal) మండలం తాళ్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యమైంది. పక్క సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, అటవీ శాఖ అధికారులు (Forest Department) ఈ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన గొర్రెను చంపిందనే కోపంతో గొర్రెల కాపరి విషం పెట్టి చిరుతను చంపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వన్యప్రాణిని పూడ్చిన చోట చిరుత అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Kammerpally Leopard Carcass | ఉమ్మడిగా విచారణ..
గొర్రెల కాపరిపై వన్యప్రాణుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు తమ రేంజ్ పరిధిలో భయభ్రాంతులకు గురి చేసిన చిరుత చివరికి కళేబరంగా మారడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం టాస్క్ఫోర్స్, అటవీశాఖాధికారులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. సదరు గొర్రెల కాపరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ ఘటన ఇరవై రోజుల కిందటే జరిగినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: బొలారంలో భారీ అగ్నిప్రమాదం