Godavari Water Levels | దిగువన గోదావరికి జలకళ.. ఎగువన వెలవెల

గోదావరి నది ఎగువన వెలవెలబోతోంది. మరోవైపు దిగువన కాళేశ్వరం వద్ద మాత్రం కళకళలాడుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Godavari Water Levels | గోదావరి నది ఎగువన వెలవెలబోతోంది. మరోవైపు దిగువన కాళేశ్వరం (Kaleshwaram) వద్ద మాత్రం కళకళలాడుతోంది. అయితే ఆ నీరు రాష్ట్ర రైతులకు ఉపయోగపడటం లేదు.

రాష్ట్రంలో వర్షాలు పడటం లేదు. అంతేగాకుండా మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్​ ఎగువన సైతం భారీ వర్షాలు పడటం లేదు. దీంతో ఎగువన గోదావరికి ప్రవాహం లేక వెలవెలబోతుంది. ప్రాజెక్ట్​పై గల శ్రీరామ్​సాగర్​, ఎల్లంపల్లి నీరు లేక బోసిపోతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో దిగువన గోదావరి ఉప్పొంగుతోంది. ప్రాణహితకు భారీ వరద వస్తుండటంతో మేడిగడ్డ వద్ద 70 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో నమోదు అవుతోంది.

Godavari Water Levels | 85 గేట్లు తెరిచిన అధికారులు

మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీ కుంగిన విషయం తెలిసిందే. ఎన్​డీఎస్​ఏ సూచన మేరకు అధికారులు నీటిని నిల్వ చేయడం లేదు. 85 గేట్లు తెరిచి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 70,140 క్యూసెక్కులుగా నమోదు అవుతోంది. గోదావరి జలాలు దిగువకు వెళ్తున్నాయి.

Godavari Water Levels | జలాశయాలు ఖాళీ

Godavari Water Levels

తెలంగాణలోని ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు ఖాళీ అయ్యాయి. వానాకాలం మొదలై 40 రోజులు అవుతున్నా.. చెరువులు, డ్యామ్​ల్లోకి కొత్త నీరు రాలేదు. దీంతో అన్ని ప్రాజెక్ట్​లు డెడ్​స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. తాగునీటి అవసరాల కోసమే నీటిని కేటాయిస్తున్నారు. దీంతో ఆయా ప్రాజెక్ట్​ల కింద ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: Shamshabad Bolero Accident | శంషాబాద్‌లో బొలెరో బీభత్సం.. ఇద్దరు మహిళల మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *