Srisailam Power Generation | శ్రీశైలంలో విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభం

శ్రీశైలం ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. దీంతో విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam Power Generation | శ్రీశైలం ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే ఇన్​ఫ్లో స్వల్పంగా తగ్గింది.

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉధృతంగా పారుతోంది. జూరాల, శ్రీశైలం జలాశయాలకు ఇన్​ఫ్లో కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు (Jurala Project)కు 2.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. విద్యుత్​ ఉత్పత్తి, గేట్ల ద్వారా 2,11,615 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీరు శ్రీశైలంకు వస్తోంది.

Srisailam Power Generation | 155 టీఎంసీలకు చేరిన శ్రీశైలం

Srisailam Power Generation

శ్రీశైలం ప్రాజెక్ట్​లోకి 2,07,821 క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యామ్​ పూర్తిస్థాయి నీటిమట్టం 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 155.3 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో.. అధికారులు జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 25,779 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుండి నీటి విడుదల – 4,739 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుత్​ ఉత్పత్తి ద్వారా విడుదల చేసిన నీరు నాగర్జున సాగర్​కు వెళ్తోంది. దీంతో సాగర్​కు 24,779 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది.

ఇది కూడా చదవండి..: Kavitha’s BC Slogan | బీసీ నినాదం.. అవకాశవాద రాజకీయాల ఓటు బ్యాంక్ గేమ్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *