అక్షరటుడే, వెబ్డెస్క్ :Vikarabad Bus Accident | వికారాబాద్ జిల్లా (Vikarabad District)లో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి దగ్గర ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
Vikarabad Bus Accident | 20 మందికి గాయాలు
కేసరం నుంచి చింతకుంట వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అనంతగిరిలోని లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లగానే, స్థానికులు సహాయం చేయడానికి పరుగెత్తుకొచ్చారు. సహాయక బృందాలు వచ్చేలోపే వారు బస్సు నుంచి ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి..: Vikarabad Mother Suicide | ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య