అక్షరటుడే, పెద్దకొడప్గల్: Power Cuts Farmers | కరెంటు కోతలతో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు జాతీయ రహదారిపై రాస్తారాకో చేశారు.
Power Cuts Farmers | పంటలకు నీరందకపోవడంతో..
శాంతపూర్, మాన్యపూర్, సీతారాంపల్లి, జగన్నాథ్ పల్లి, రాజపూర్ గ్రామస్తుల రైతులు (Farmers) రహదారిపై రాస్తారోకో చేశారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలను కాపాడుకోవడం కష్టంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే దశలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని రైతులు ఆరోపించారు. రైతులు జాతీయ రహదారిపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రైతులను రహదారిపైకి రాకుండా కట్టడి చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో జగన్నాథ్ పల్లి, శాంతాపూర్, చౌరస్తాలో బైటయించి నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన విద్యుత్‌శాఖ అధికారులు చరవాణిలో రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Cannabis Smuggling | పనసపండ్ల చాటున గంజాయి రవాణా.. ముగ్గురిపై పీడీయాక్ట్..