Nizamabad GGH | చోరీ చేస్తూ తప్పించుకునేందుకు యత్నం.. జీజీహెచ్​ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

ఆస్పత్రిలో చోరీకి యత్నించిన ఓ వ్యక్తి నాల్గో అంతస్తు పైనుంచి జారి పడి మృతి చెందాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad GGH | ఆస్పత్రిలో చోరీకి యత్నించిన ఓ వ్యక్తి నాలుగో అంతస్తు పైనుంచి జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం జిల్లా జనరల్​ ఆస్పత్రిలో(GGH Nizamabad) చోటు చేసుకుంది.

Nizamabad GGH | చోరీకి వచ్చి..!

ఆస్పత్రిలో రోగుల బంధువులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జీజీహెచ్​లోని నాల్గో అంతస్తులో ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. ఆ ఫ్లోర్​లో మెడికల్​ నర్సింగ్​ కళాశాల విద్యార్థులు తమ బ్యాగులను ఉంచుతారు. ఈ క్రమంలో చోరీకి యత్నించిన వ్యక్తిని ఫ్లోర్​ ఇన్​ఛార్జి గమనించాడు. దీంతో అనుమానిత వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో కిటికి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి కిందపడ్డారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం జీజీహెచ్​లోనే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సంబంధిత వ్యక్తి వివరాలు తెలియరాలేదు. 1వ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: శివుడికి ఎంతో ఇష్టమైన 5 నైవేద్యాలు .. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *