Free Legal Aid for Prisoners | జైలు ఖైదీలకు ఉచిత న్యాయ సాయం..: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నీలిమ

ఆర్థిక స్తోమత లేని జైలు ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నీలిమ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ​నిజామాబాద్ లీగల్: Free Legal Aid for Prisoners | ఆర్థిక స్తోమత లేని జైలు ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందిస్తామని జిల్లా (Nizamabad) న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నీలిమ పేర్కొన్నారు. లీగల్ సర్వీసెస్ డే (జాతీయ నాయ సేవా దినోత్సవం) సందర్భంగా బుధవారం నిజామాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నీలిమ ముద్దసాని జిల్లా కేంద్రీయ జైలును సందర్శించారు.

Free Legal Aid for Prisoners | జిల్లా సెంట్రల్​ జైలు సందర్శన..

 ఈ సందర్భంగా ఆమె ఖైదీలతో ముఖాముఖిగా మాట్లాడుతూ సంస్థ ద్వారా అందుతున్న సేవలు, ఉచిత న్యాయ సహాయం గురించి వివరంగా నిజామాబాద్ లీగల్ వివరించారు. ​ఆర్థిక స్తోమత లేని పేదలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా న్యాయ సేవలు అందించడంతో పాటు, వారి తరఫున వాదించడానికి ఉచిత న్యాయవాదులను కూడా నియమిస్తామన్నారు.

Free Legal Aid for Prisoners | రాజీపడే అవకాశం ఉన్న కేసుల్లో..

ఇతర కులాలకు చెందిన వారికి సంబంధించి వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నట్లయితే, వారికి కూడా ప్రభుత్వం తరపున ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ​రాజీపడే అవకాశం ఉన్న కేసుల్లో ‘రాజీ మార్గమే… రాజ మార్గం’ అనే నినాదంతో మధ్యవర్తుల ద్వారా సమన్వయం కురిపిస్తూ కేసులను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం ఖైదీల ఆరోగ్య పరిస్థితులు, జైలులోని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ కళాసాగర్, డిప్యూటీ జైలర్ అజయ్ చారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: బీజేపీలోకి సూర్య కుమార్ యాదవ్..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *