అక్షరటుడే, కామారెడ్డి: Municipal Waterman | విధుల్లో ఉన్న మున్సిపాలిటీ వాటర్మన్ను పాము కాటు (Snake Bite)వేసింది. ఈ ఘటన సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీలో (Kamareddy Municipality) జరిగింది.
Municipal Waterman | వాటర్ సెక్షన్లో..
కామారెడ్డి మున్సిపాలిటీలో వాటర్ సెక్షన్లో వాల్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్యామల శ్రీనివాస్ పాము కాటుకు గురయ్యారు. ఉదయం ఎప్పటిలాగే వాటర్ ట్యాంకుల వద్ద పని చేస్తుండగా అతన్ని పాము కాటేసింది. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది హుటాహుటిన శ్రీనివాస్‌ను జీజీహెచ్‌కు(GGH Kamareddy) తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని శ్రీనివాస్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, మున్సిపాలిటీ తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది సంక్షేమమే తమకు ఎల్లప్పుడూ ముఖ్యమని ఛైర్పర్సన్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.
ఇది కూడా చదవండి: లోకల్ ట్రైన్లో ఆగిపోయిన ఏసీ.. పలువురికి అస్వస్థత..