Sriram Sagar Flood | శ్రీరామ్​సాగర్​కు జలకళ.. పెరుగుతోన్న వరద

రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే ఆర్మూర్ : Sriram Sagar Flood | రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే ఆలస్యంగా ఇన్​ఫ్లో వస్తున్నా.. వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sriram Sagar Flood | 4,051 క్యూసెక్కుల వరద..

ప్రాజెక్టులోకి 4,051 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project) పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1,065 అడుగులు 16.405 టీఎంసీలుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1,075 అడుగులు 32.897 టీఎంసీల నీటి నిలువ ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాజెక్టులో 16 టీఎంసీలు తక్కువగా నీటి నిల్వ ఉంది. కాగా ప్రస్తుతం వర్షాలు కురుస్తూ.. వరద నీరు చేరుతుండడంతో ప్రాజెక్ట్​ పరిధిలోని ఆయకట్టు రైతులు ఖరీఫ్ పంటలకు సిద్ధమవుతున్నారు.

ఇది కూడా చదవండి..: Telangana University Snakebite | తెయూలో హాస్టల్​లో కలకలం.. విద్యార్థినికి పాముకాటు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *