అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Tallarampur VDC Action | తాళ్లరాంపూర్ వీడీసీపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మోపాల్, నిజామాబాద్ రూరల్ (Nizamabad) మండల గౌడ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ముదక్పల్లిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
Tallarampur VDC Action | రోజురోజుకూ పెరుగుతున్న ఆగడాలు..
జిల్లాలో గౌడ కులస్తులు, గీత కార్మికులపై వీడీసీల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. ప్రభుత్వం గౌడ కులస్తులకు కేటాయించిన లైసెన్సుల ద్వారా గీత వృత్తి చేస్తూ జీవనం కొనసాగిస్తుంటే వారిపై వీడీసీలు దాడులు చేయడం సరైంది కాదన్నారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే ఈ విధంగా సాంఘిక బహిష్కరణ చేయడం చట్ట విరుద్ధమని వారు మండిపడ్డారు. రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, చట్టాలు, ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ వీడీసీలు సమాంతరంగా గ్రామాల్లో వ్యవస్థలను నడపడంపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల నుంచి వేలాది మంది గౌడ్లను ఏకం చేసి ‘చలో రాంపూర్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు. నాయకులు వేణుగౌడ్, సాయిగౌడ్, దశగౌడ్, దత్తగౌడ్ రాజుగౌడ్, అశోక్ గౌడ్, బాలరాజు గౌడ్, ఈశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: నా తమ్ముడు.. అనంత్ అంబానీ!