Banswada Theft Case | బెయిల్ కోసం అప్పులు.. వాటిని తీర్చేందుకు చోరీల బాట..

బెయిల్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఇద్దరు వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర వెల్లడించారు.

shashi kiran Mottala

అక్షర టుడే, కామారెడ్డి: Banswada Theft Case | బెయిల్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఇద్దరు వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. దీంతో పక్కా సమాచారంతో పోలీసులు (Banswada Police) ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) వెల్లడించారు.

Banswada Theft Case | హైదరాబాద్​ వెళ్తుండగా..

బాన్సువాడ పట్టణంలోని గౌలిగూడ కాలనీకి చెందిన చింతల భాస్కర్ ఇంట్లో సెప్టెంబర్ 27న బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. అక్టోబర్ 2న బొగ్గుగుడిసె చౌరస్తా సమీపంలో దొంగిలించిన సొత్తును హైదరాబాద్​లో విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను దండుగుల మైసయ్య అలియాస్ మణికంఠ (25), దండుగుల ఎల్లయ్య అలియాస్ రాజు (20)గా గుర్తించారు. వీరిద్దరూ బంధువులు. నిందితుడు మైసయ్య బాధితుడి ఇంటి పక్కనే ఉంటూ వారి రాకపోకలను గమనిస్తుండేవాడు.

Banswada Theft Case | బెయిల్​ కోసం..

జూన్, జూలై నెలల్లో ఆరు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లిన మైసయ్యకు బెయిల్ కోసం అతని భార్య అప్పులు చేసింది. ఆ అప్పులు తీర్చేందుకు వైన్స్ కు వెళ్లి మద్యం తాగిన తర్వాత ఇద్దరూ కలిసి చోరీకి పథకం వేసినట్లు విచారణలో తేలింది. వారి నుంచి రూ.56 లక్షల విలువైన 31.2 తులాల బంగారు ఆభరణాలు, మూడు కిలోల వెండి ఆభరణాలు, రూ.9,700 నగదు, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మైసయ్యపై గతంలో బాన్సువాడలో 4, గాంధారిలో 2 కేసులు ఉన్నాయి. నిందితులను బిచ్కుంద కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. సమావేశంలో బాన్సువాడ డీఎస్పీ పి.విఠల్ రెడ్డి, టౌన్ సీఐ టి. శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త రూల్స్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *