నిజామాబాద్Pipeline Leakage Issue | పైప్​లైన్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపాలి : ఎమ్మెల్యే ధన్​పాల్​

Pipeline Leakage Issue | పైప్​లైన్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపాలి : ఎమ్మెల్యే ధన్​పాల్​

నగరంలోని మిర్చి కాంపౌండ్​కు వెళ్లే దారిలో మంచినీటి పైప్​లైన్ లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ అధికారులను ఆదేశించారు.

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Pipeline Leakage Issue | నగరంలోని మిర్చి కాంపౌండ్​కు వెళ్లే దారిలో మంచినీటి పైప్​లైన్ లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (MLA dhanpal) అధికారులను ఆదేశించారు. నగరంలోని మార్వాడి గల్లీ, మిర్చి కాంపౌండ్​లలో మున్సిపల్ కమిషనర్(Nizamabad Municipal Commissioner) దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీకాంత్​తో కలిసి పరిశీలించారు.

Pipeline Leakage Issue | మూడురోజులుగా ఇబ్బందులు

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా మంచినీటి పైప్​లైన్ లీకేజీకి (pipeline leakage) గురైందని, దీంతో మురికి నీరు కలుషితమై నల్లాల్లోకి వస్తున్నాయన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడం తగదన్నారు. ఏళ్లుగా ఉన్న పాత లైన్​ను సర్వే చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. నూతన పైప్​లైన్ వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు సైతం కార్పొరేటర్లకు, ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని సూచించారు. అలాగే మిర్చి కాంపౌండ్​లో చేతిపంపులకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Pipeline Leakage Issue | గంజ్​ కమాన్​ వద్ద..

ప్రధానంగా గంజ్ కమాన్ వద్ద గత కొన్ని రోజులుగా నెలకొన్న డ్రెయినేజీ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. టెండర్లు పూర్తయినా పనులు ఎందుకు ప్రారంభించలేదని కమిషనర్​ను ప్రశ్నించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. వచ్చే మూడు రోజుల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్, కార్పొరేషన్ ఏఈ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.

waterrrr

ఇది కూడా చదవండి: YS Jagan Comments | కేటీఆర్​తో పొత్తుల గురించి మాట్లాడిన చంద్రబాబు.. జగన్​ సంచలన వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ.. 23న జరిగే కేబినెట్ మీటింగ్‌పై కీలక డిమాండ్లు

అక్షరటుడే వెబ్‌డెస్క్Telangana Paddy Crisis| తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న...

Rajiv Gandhi | మహిళా రిజర్వేషన్లు తెచ్చిన నాయకుడు రాజీవ్​గాంధీ : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajiv Gandhi | మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ...

Telangana Liquor Prices | తెలంగాణ మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత మద్యం ధరల పెంపు?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Liquor Prices | తెలంగాణ (Telangana)లోని మందుబాబులకు...