అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Red Cross Society Elections | నగరం (Nizamabad)లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. ఈ సందర్భంగా భాగంగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.
Red Cross Society Elections | 15పోస్టులకు గాను.. 29 నామినేషన్లు..
ఈ సందర్భంగా మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి 15 పోస్టులకు గాను మొత్తం 29 నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నామినేషన్లను ఎన్నికల అధికారి, జిల్లా సహకార అధికారి ఎన్ శ్రీనివాస్ రావు స్వీకరించారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి తదుపరి ప్రక్రియను ఎన్నికల షెడ్యూల్ ప్రకారం కొనసాగించనున్నట్లు ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Ganesh Immersion Route | గణేష్ నిమజ్జన మార్గాన్ని పరిశీలించిన మేయర్