అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao 22A | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. భూములను 22-Aలో ఎందుకు పెట్టింది? ఎవరు పెట్టామన్నారు అని ఆయన ప్రశ్నించారు. 60 ఏళ్ల నుండి ఉంటున్న ఇల్లును 22-A నిషేధిత జాబితాలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్కాజ్గిరి (Malkajgiri)లో నిర్వహించిన నిషేధిత జాబితా భూ బాధితుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. రాత్రికి రాత్రే కాలనీలు, లే అవుట్లు, HMDA అమ్మిన భూములు, HUDA అమ్మిన భూములు, వేలంలో ప్రభుత్వం అమ్మిన భూములను 22-A నిషేధిత జాబితాలో పెడితే ప్రజలు ఏమైపోవాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎమ్మార్వో దగ్గరికి, అక్కడికి పోతే ఆర్డీవో దగ్గరికి, అక్కడికి పోతే కలెక్టర్ దగ్గరికి, ఆయన దగ్గరికి పోతే ULC ఆఫీసు దగ్గరికి పొమ్మని ప్రజలను తిప్పుతున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అక్రమాలకు ప్రజలు ఎందుకు కష్టాలు పడాలని ఆయన ప్రశ్నించారు.
Harish Rao 22A | మంత్రి పొంగులేటి
రెవెన్యు మంత్రి పొంగులేటి తప్పు చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. తప్పులు సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉందన్నారు. అక్రమంగా నిషేధిత జాబితాలో పెట్టిన పేదల ఇళ్లను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. పొంగులేటి వెంటనే రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలన్నారు. హైదరాబాద్ మొత్తం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలోకి రావాలని రాత్రికి రాత్రే భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తోందని విమర్శించారు.
ఇది కూడా చదవండి..: Student Loan Harassment | విద్యార్థులే లక్ష్యంగా వడ్డీ దందా!