అక్షర టుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Council Meeting | నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) కార్యాలయంలో మంగళవారం మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అయితే డివిజన్లలో సమస్యలపై కార్పొరేటర్లు ధ్వజమెత్తారు.
Nizamabad Council Meeting | తాగునీరు అందక అవస్థలు
కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలం అయ్యారని కార్పొరేటర్లు ఆరోపించారు. ముఖ్యంగా శివారు కాలనీల్లో తాగునీరు అందడం లేదని.. చిన్నపాటి వర్షానికి డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి రోడ్ల మీదికి మురికి నీరు వస్తోందని ఆరోపించారు. డివిజన్లలోని కాలనీలో స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.

సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. వర్షాకాలం నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన వీటిని సరిచేయాలని డిమాండ్ చేశారు. మేయర్ మాట్లాడుతూ.. 90 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి డివిజన్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. కార్పొరేటర్లు లేవనెత్తిన సమస్యలను ప్రణాళికతో పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ అఫీషియో మెంబర్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bheemgal Palle Davakhana | పల్లె దవాఖానకు జాగా కరువు.. నిధులున్నా నిర్మాణానికి నోచుకోని వైనం