GGH Mock Drill | జీజీహెచ్​లో మాక్​డ్రిల్​

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: GGH Mock Drill | వరదలు, ఇతర విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీజీహెచ్​లో సోమవారం ఫ్లడ్​ మార్క్​ డ్రిల్​ నిర్వహించారు. ఐసీఎస్​ ఇన్​ఛార్జి, ఆర్డీవో రాజేంద్ర కుమార్​, జీజీహెచ్ (GGH Nizamabad)​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్ నాగమోహన్​​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

GGH Mock Drill | రోగుల తరలింపు.. అత్యవసర సేవల సమన్వయం..

జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సహకారంతో ఫ్లడ్స్​ సమయంలో (flood preparedness) తీసుకోవాల్సిన చర్యలపై వైద్యసిబ్బందికి అవగాహన కల్పించారు. ఆస్పత్రిలో ఆకస్మికంగా వరదలు సంభవిస్తే (disaster management drill) రోగులను సురక్షితంగా తరలించడం, అత్యవసర సేవల సమన్వయం, విభాగాల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్, విపత్తు నిర్వహణ విధానాలపై ప్రాక్టికల్​గా మాక్ డ్రిల్‌ నిర్వహించారు. ఎస్​డీఆర్​ఎఫ్​ (SDRF), ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రిసిటీ, ఎన్​సీసీ (NCC), ఆపద మిత్ర, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్​అండ్​బీ శాఖ, వైద్యారోగ్యశాఖ శాఖ అధికారులు, 108 అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో వైద్యులు రాజశేఖర్, సరస్వతి, నర్సింగ్ సూపరింటెండెంట్ లలిత, ఆస్పత్రి సిబ్బంది, 108 బృందం సభ్యులు పాల్గొన్నారు.

mack2

ఇది కూడా చదవండి: Peddi Trailer | ‘పెద్ది’ ట్రైలర్‌కు భారీ స్పందన.. రామ్ చరణ్ మాస్ అవతార్‌కు ఫిదా అవుతున్న అభిమానులు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *