Fee Regulation Act | ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Fee Regulation Act | ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని పీడీఎస్​యూ (PDSU) ఆర్మూర్​ శాఖ డిమాండ్​ చేసింది. ఈ మేరకు పట్టణంలోని బస్టాండ్​ ప్రాంతంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించింది.

Fee Regulation Act | ప్రతి ఏడాది 20 నుంచి 30శాతం ఫీజులు పెంచుతూ..

ఈ సందర్భంగా పీడీఎస్​యూ ఆర్మూర్ (Armoor) ఏరియా అధ్యక్షుడు నిఖిల్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రతి ఏడాది దాదాపు 20 నుంచి 30 శాతం వరకు ఫీజులను పెంచుతున్నారన్నారు. దీంతో పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో పేద మధ్య తరగతి విద్యార్థులే చదువుకుంటున్నారన్నారు. పర్మిషన్ లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు పర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్​యూ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఏరియా ప్రధాన కార్యదర్శి రాజు, కార్యదర్శి సిద్ధార్థ్, నాయకులు వినోద్, ప్రణయ్, రేవంత్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Drunk Drive Checks | జిల్లాలో డ్రంకన్​​ డ్రైవ్​ తనిఖీలు.. వారంలోనే 162 మందికి జరిమానాలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *