అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganesh Immersion | కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన (Ganesh Immersion) కోసం భారీ క్రేన్లు సిద్ధం చేశారు. వీటిని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి బుధవారం ప్రారంభించారు.
Kamareddy Ganesh Immersion | ఏర్పాట్లు చేయాలి
నిమజ్జన ప్రాంతంలో క్రేన్లతో పాటు లైటింగ్, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యం, బారికేడ్లు తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఛైర్పర్సన్ ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసు, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనానికి వీలుగా ముందస్తుగా క్రేన్లను సిద్ధం చేశామనిర, నిమజ్జన ఘాట్ల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులు, నిర్వాహకులు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్పర్సన్ కాసర్ల గోదావరి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంత్ రావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: రష్యాపై ఒత్తిడి పెంచండి.. భారత్, చైనాలకు జెలెన్‌స్కీ పిలుపు