అక్షరటుడే, వెబ్డెస్క్ : Bhadradri Temple | ఓట్ల కోసం దేవుడిని కూడా మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) అన్నారు. భద్రాచలం ఆలయాన్నని బుధవారం ఆయన దర్శించుకున్నారు. రాములోరికి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రభుత్వం భద్రాచలంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నిర్ణిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. బీఆర్ఎస్ (BRS) నాయకులు సీతారామచంద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారని, ఓట్ల కోసం చివరికి దేవుని పేరు చెప్పి మోసం చేశారన్నారు.
Bhadradri Temple | రూ.351 కోట్ల నిధులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భద్రాచలం అభివృద్ధి కోసం రూ.351 కోట్లు కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. సుమారు రూ. 275 కోట్లు నిధుల మంజూరుతో పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందేలా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : BJP State Incharges | బీజేపీలో భారీ ప్రక్షాళన.. యూపీ సహా వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు