Ganesh Immersion Holiday | గణేశ్​ నిమజ్జనం.. 25న పాఠశాలలకు సెలవు

గణేశ్​ నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 25న హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్​గిరి జిల్లాల్లో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganesh Immersion Holiday | హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో గణేశ్ నిమజ్జనం వైభవంగా నిర్వహిస్తారు. రోడ్లన్ని భక్తులు, శోభాయాత్ర వాహనాలతో కిక్కిరిసిపోతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నిమజ్జనం నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

హైదరాబాద్​ నగరంలో గణేశ్​ నిమజ్జనం ఈ నెల 25న జరగనుంది. దీంతో ఆ రోజు (శుక్రవారం) హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి (Rangareddy) జిల్లా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్​ జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపు కారణంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. దీనికి బదులుగా నవంబర్ 14 (రెండవ శనివారం) ఆ జిల్లాల్లో కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు పని దినంగా ఉంటుందని స్పష్టం చేశారు.

Ganesh Immersion Holiday | పోలీసుల సన్నద్ధం

హైదరాబాద్ నగరంలో వేలాది గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ వేడుక చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సెప్టెంబర్‌ 25న మహానిమజ్జన శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభయాత్రపై 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. శోభాయాత్ర బందోబస్తుకు 20 వేల మంది పోలీస్‌ సిబ్బందిని నియమించారు.

దీనిని కూడా చదవండి : Uttam Kumar Reddy | రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం..మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *