Builders Association India | బిల్లులు చెల్లించకుంటే బిల్డింగ్​ కాంట్రాక్టర్లు బతికేదెట్లా..

రాష్ట్రంలో బిల్డింగ్​ కాంట్రాక్టర్ల పరిస్థితి అధ్వానంగా మారిందని.. చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందుల్లో ఉన్నామని వారన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్​క్లబ్​లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రెస్​మీట్ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Builders Association India | రాష్ట్రంలో బిల్డింగ్​ కాంట్రాక్టర్ల పరిస్థితి అధ్వానంగా మారిందని.. చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందుల్లో ఉన్నామని వారన్నారు. ఈ మేరకు నగరంలో బిల్డర్స్ అసోసియేషన్ (Builders Association) ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రెస్​మీట్ నిర్వహించారు.

Builders Association India | చేసిన పనులకు బిల్లులివ్వట్లేదు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గత పదేళ్ల నుంచి కాంట్రాక్టర్లకు ప్రజాప్రతినిధులు అపాయింట్​మెంట్లు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. కాంట్రాక్టర్లకు పేమెంట్లు రావడం లేదని.. ఇచ్చినా సీరియల్​ ప్రకారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పద్ధతి ప్రకారం బిల్లులు ఇవ్వాల్సి ఉండగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు నచ్చిన వాళ్లకే బిల్లులు మంజూరు చేస్తున్నారని వివరించారు. బిల్లుల కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని.. ఇకపై బడ్జెట్ లేకపోయినా కాంట్రాక్ట్​లు ఇచ్చి పనులు చేయించవద్దని వారు విన్నవించారు. ఆర్థికంగా ప్రభుత్వం (Government of Telangana) వద్ద డబ్బులు లేకున్నా పనులు చేయించి కాంట్రాక్టర్లను రోడ్డున పడేయవద్దని వారు స్పష్టం చేశారు. బిల్లులు రాకపోవడంతో ఎంతోమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కాంట్రాక్టర్ల సమస్య పరిష్కారం కోసం 18న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

tyty

ఇది కూడా చదవండి : Telangana Monsoon Arrival | చల్లని కబురు.. తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *