Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Telangana Monsoon Arrival | చల్లని కబురు.. తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు..

అన్నదాతలకు వాతావరణ శాఖ గుడ్​ న్యూస్ ​చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి.

Balla Sandeep Kumar
Last updated: June 8, 2026, 3:40 pm 3:40 pm
Balla Sandeep Kumar
Share
Telangana Monsoon Arrival

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Monsoon Arrival | అన్నదాతలకు వాతావరణ శాఖ (Meteorological Department) గుడ్​ న్యూస్ ​చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. కొంతకాలంగా ఎండలు మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అక్కడక్కడ అకాల వర్షాలు కురిసిన ఎండలు తగ్గకపోవడంతో ఉపశమనం లభించలేదు. దీంతో ప్రజలు తొలకరి పలకరింపు కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో నైరుతి రాకతో రాష్ట్రంలో తొలకరి జల్లులు కరిశాయి. వాతావరణం చల్లబడింది.

తెలంగాణను నైరుతి రుతుపవనాలు సోమవారం తాకాయి. గద్వాల జిల్లాలోకి ప్రవేశించాయి. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రం అంతటా రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నారు. కాగా ఉదయం నుంచే పలు జిల్లాలో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. వాతావరణం చల్లబడింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు..  ఏపీ, మహారాష్ట్రలో 30శాతం విస్తరించాయి. మరోవైపు బంగాళాఖాతంలో పూర్తిగా వ్యాపించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Telangana Monsoon Arrival | ఎల్​నినో ప్రభావం

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాలో లోటు వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. మధ్య తెలంగాణలో సాధారణ వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ తెలంగాణలో తక్కువ పడుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు సాగు ప్రణాళికలు రూపొంచించుకోవాలని అధికారులు సూచించారు.

Telangana Monsoon Arrival | సాగు పనుల్లో బిజీ

Telangana Monsoon Arrival

నైరుతి ఆగమనంతో అన్నదాతలు సాగు పనుల్లో బిజీ అయ్యారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దుక్కులు దున్నారు. కొంతమంది తుకాలు కూడా పోశారు. తొలకరి పలకరింపుతో తాజాగా వ్యవసాయ పనులు జోరందుకోనున్నాయి. ఇప్పటికే అన్నదాతలు ఎరువులు, విత్తనాల కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆయా దుకాణాలు నిత్యం కళకళలాడుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Kishan Reddy Counter | సింగరేణిపై కేటీఆర్​కు కిషన్​రెడ్డి కౌంటర్​

TAGGED:Agriculture TelanganaFarmers NewsHeavy RainfallMonsoon UpdateSouthwest MonsoonTelangana MonsoonTelangana Monsoon ArrivalTelangana Rainstelangana weather
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ganesh Bigala Ganesh Bigala | గణేష్ బిగాలను పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
Next Article Tata EV Offers Tata EV Offers | టాటా ఈవీలపై భారీ ఆఫర్లు..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Solar Energy Storage
తెలంగాణ

Solar Energy Storage | సోలార్ ఎనర్జీ నిల్వ.. సింగరేణికి సిరులు

By Srinivas Kolluri
Southwest Monsoon Kerala
జాతీయంతెలంగాణ

Southwest Monsoon Kerala | ఈ నెల 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు..మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం

By Naresh Chandan
RTC Strike Loss
హైదరాబాద్తెలంగాణ

RTC Strike Loss | సమ్మె ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.17 కోట్లకు పైగా నష్టం!

By Shashi kiran Mottala
Free Sewing Machines
తెలంగాణ

Free Sewing Machines | మహిళలకు గుడ్​న్యూస్​.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.