Alumni Reunion | ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుక

మాక్లూర్​ మండలం గొట్టుముక్కల జెడ్పీహెచ్​ఎస్ పూర్వ​ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, మాక్లూర్​: Alumni Reunion | పూర్వ విద్యార్థులంతా 25ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు. ఈ రజతోత్సవానికి మాక్లూర్ (Makloor)​ మండలంలోని గొట్టుముక్కల జడ్పీహెచ్​ఎస్​ వేదికగా నిలిచింది.

Alumni Reunion | 2000-01 బ్యాచ్ విద్యార్థులు..

గొట్టుముక్కల జిల్లా పరిషత్​ పాఠశాలలో 2000-01 బ్యాచ్ విద్యార్థులు గురువారం రజతోత్సవం (Silver Jubilee Reunion) నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ప్రస్తుత పరిస్థితులను, కుంటుంబ నేపథ్యాన్ని సభలో పంచుకున్నారు. తమ పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని, అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రిటైర్డ్ హెచ్ఎం మనోహర స్వామి మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు అభ్యసించలేని విద్యార్థులు ఇప్పుడు తమ పిల్లల చదువు పట్ల నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. శ్రీ సాయి రమణ కాన్వెంట్ స్కూల్ వ్యవస్థాపకులు వెంకటరమణ మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం తాను ప్రైవేటుగా నడిపిన స్కూలులో ఓనమాలు దిద్దిన విద్యార్థులు తనను, తమ స్కూల్ సిబ్బందిని గుర్తు పెట్టుకొని మరి సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఆహ్వానించడం ఆనందంగా ఉందని చెప్పారు.

Alumni Reunion | ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కవ కాదు..

మ్యాథ్స్ ట్యూషన్ మాస్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ.. జీవన ప్రయాణంలో ఎందరో ఎక్కడెక్కడికో చేరుకుంటారని తెలిపారు. తోటి విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని, తాము మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నామన్న భావన ఎప్పటికీ రానీయవద్దని చెప్పారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అప్పటి హెచ్​ఎం మనోహర స్వామి, ఉపాధ్యాయులు సుదర్శన్, పుష్ప, రమేశ్​తో పాటు శ్రీ సాయి రమణ కాన్వెంట్ స్కూల్ వ్యవస్థాపకులు రమణరావు, ఉపాధ్యాయులు అల్లారి భోజన్న, హర్షవర్ధన్, ప్రకాశ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఇన్‌స్టాలోకి సోనియా గాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఇదే! 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *