Paddy Procurement | యాసంగిలో విజయవంతంగా ధాన్యం అమ్మకాలు పూర్తి..

యాసంగిలో విజయవంతంగా ధాన్యం అమ్మకాలు పూర్తి చేశామని తాండూర్​ కిచ్చన్నపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు ఆకిడి గంగారెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Procurement | యాసంగిలో (Yasangi Season) విజయవంతంగా ధాన్యం అమ్మకాలు పూర్తి చేశామని తాండూర్​ కిచ్చన్నపేట ప్రాథమిక సహకార సంఘం(PACS) అధ్యక్షుడు ఆకిడి గంగారెడ్డి అన్నారు. సంఘం కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు.

Paddy Procurement | రైతుల ఖాతాల్లో రూ.18.24 కోట్లు జమ..

ఈ సందర్భంగా అధ్యక్షుడు గంగారెడ్డి మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో సంఘం పరిధిలోని 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిద్వారా 3,117 మంది రైతుల నుండి 1,41,532 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. తద్వారా రూ.18.24 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మార్క్‌ఫెడ్(Markfed) ద్వారా జొన్నలు 252 మంది రైతుల నుండి 4,157 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకు సహకరించిన అధికారులకు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వేముల సంగయ్య, విజయ్ కుమార్, సిద్దిరామ్ రెడ్డి, హనుమా నాయక్, బన్సీ నాయక్, కిషన్ నాయక్, సీఈవో చంద్ర మురళి తదితరులు పాల్గొన్నారు.

Paddy Procurement 2

ఇది కూడా చదవండి : కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది దుర్మరణం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *